నిరాడంబరంగా నితిన్ -షాలిని ఎంగేజ్మెంట్.

నిరాడంబరంగా నితిన్ -షాలిని ఎంగేజ్మెంట్.

Published on Jul 22, 2020 5:45 PM IST

హీరో నితిన్ నేడు ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నితిన్ తన చిరకాల ప్రేయసి షాలిని కందుకూరి ఉంగరాలు మార్చుకున్నారు. ఇక ఈనెల 26న వీరిద్దరి వివాహం ఓ ప్రేవేట్ రిసార్ట్ లో జరగనుంది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరు కానున్నారు.

ఈ వివాహానికి నితిన్ తన అభిమాన నటుడు మరియు ఆప్తుడు అయిన పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు. అలాగే తెలంగాణా సీఎం కేసీఆర్ ని కూడా ఆహ్వానించడం జరిగింది. కాగా నితిన్ షాలిని వివాహం ఏప్రిల్ నెలలోనే జరగాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా అప్పుడు వివాహం వాయిదా పడింది. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపించని తరుణంలో వీరు పెళ్ళికి సిద్దమయ్యారు.

తాజా వార్తలు