యంగ్ హీరో నితిన్ తన ప్రేయసి షాలినితో నిన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక నెల 26న పరిమిత బంధు మిత్రుల సమక్షంలో వివాహం జరగనుంది . కాగా నితిన్ పెళ్లి అనుకోకుండా చాలా తక్కువ సమయంలో నిర్ణయించడం జరిగింది. ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే పెళ్ళికి సమయం ఉంది దీనితో నితిన్ పెళ్లి పనులలో తలమునకలై ఉన్నారట.
ఇక ఈ వివాహానికి నితిన్ తన అభిమాన నటుడు మరియు ఆప్తుడు అయిన పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు. అలాగే తెలంగాణా సీఎం కేసీఆర్ ని కూడా ఆహ్వానించడం జరిగింది. కాగా నితిన్ షాలిని వివాహం ఏప్రిల్ నెలలోనే జరగాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా అప్పుడు వివాహం వాయిదా పడింది. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపించని తరుణంలో వీరు పెళ్ళికి సిద్దమయ్యారు.