పూరితో పనిచెయ్యడం అద్భుతమంటున్న నితిన్

Nithin

వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లను అందదించి ప్రస్తుతం ‘కొరియర్ బాయ్ కళ్యాన్’ గా మన ముందుకు వస్తున్న నితిన్ తన కెరీర్ లోనే సూపర్ ఫామ్ లో వున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవలే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా విడుదలచేసారు.

ప్రస్తుతం నితిన్ ‘హార్ట్ అటాక్’ షూటింగ్ లో బిజీగా వున్నాడు. పూరి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది. పూరి తో మొదటిసారి కలిసి పనిచేస్తున్న నితిన్ చాలా ఉత్సాహంగా వున్నాడు. నిన్న చిత్రీకరించిన ఇంటర్వెల్ బ్లాకుకు సంబంధించిన విషయాలను మను ట్విట్టర్ ద్వారా తెలపకుండా వుండలేకపోయాడు. “ఇంటర్వెల్ ఎపిసోడ్ షూటింగ్ ముగించుకున్నం !!! అద్భుతంగా వచ్చింది!!! పూరి సర్ రాక్స్” అని ట్వీటిచ్చాడు.

ఈ సినిమా ద్వారా అదా శర్మ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయంకానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పూరి స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది

Exit mobile version