ఇష్క్ చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది

Gunde-Jari-Gallanthayyinde
నితిన్ వరుస ఫ్లాపులతో సతమవుతున్న దశలో కొత్త ఊపిరినిస్తూ వచ్చిన చిత్రం ‘ఇష్క్’. ఈ చిత్రానికి పని చేసిన టీం అంతా కలిసి చేస్తున్న మరో చిత్రం ‘గుండె జారి గల్లంతయ్యిందే’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ నిన్న విడుదల చేసారు. ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ నిత్యా ఈ సినిమాలో రెండు మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది. ఈ పాత్రకి ఆమె పర్ఫెక్ట్ సూట్ అయింది. ఇష్క్ సినిమాకి పని చేసిన టీం సభ్యుల్లో పిసి శ్రీరామ్ గారు మిగతా అంతా ఈ సినిమాకి చేస్తున్నాం. అనూప్ ఈ సినిమా కోసం ఇప్పటికే 3 ట్యూన్స్ ఇచ్చాడు. మూడు ట్యూన్స్ చాలా బావున్నాయి. 70% షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో సినిమాని విడుదల చేస్తాం. ఇష్క్ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అన్నాడు.

Exit mobile version