యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న నితిన్ త్వరలో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం నితిన్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ‘హార్ట్ అటాక్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాకోసం తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు. ఈ సినిమాలో నితిన్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో పాటు సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపించనున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆద శర్మ హీరోయిన్. ఈ సినిమా దర్శకత్వ బాద్యతలతో పాటు నిర్మాత భాద్యతలను కూడా పూరినే తీసుకున్నాడు. ‘హార్ట్ అటాక్’ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ చిత్ర ప్రొడక్షన్ ఇక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకొని త్వరలోనే స్పెయిన్ వెళ్లనున్నారు.