వాయిదాపడిన నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ మూవీ

వాయిదాపడిన నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ మూవీ

Published on Nov 6, 2013 12:35 PM IST

Courier-Boy-Kalyan-Nitin-Fi
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా ఈ సంవత్సరం విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళ వెర్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దానితో ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్టు సమాచారం. ప్రస్తుతం నితిన్ ‘హార్ట్ ఎటాక్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జనవరి 2014లో విడుదల కావడానికి సిద్దమవుతోంది. రెండు భాషలలో తెరకెక్కుతున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలో నితిన్ సరసన యామి గౌతం హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభుదేవా శిష్యుడు ప్రేం సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గౌతం మీనన్ నిర్మిస్తోంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు మంచి యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కనుందని సమాచారం.

తాజా వార్తలు