‘తమ్ముడు’ కోసం నితిన్ డెడికేషన్.. డబ్బింగ్ కూడా పూర్తి!

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా హీరో నితిన్ ఈ చిత్రంలోని తన ‘జై’ పాత్ర డబ్బింగ్ వర్క్‌ను పూర్తి చేశాడు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన తన పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు హీరో నితిన్. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ను కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలో నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా అందాల భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూ్స్ చేస్తున్నారు.

Exit mobile version