‘తమ్ముడు’ నుంచి బ్యూటిఫుల్ గా ఫస్ట్ సింగిల్!

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టుగా రీసెంట్ ట్రైలర్ చూస్తే అనిపించింది. ఇలా మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా మేకర్స్ మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ వినేందుకు ఇంపుగా ఉందని చెప్పవచ్చు.

నితిన్ కి తన అక్క ఫ్యామిలీలో ఓ చిన్నారికి నడుమ సాగే సాంగ్ లా ఇది కనిపిస్తుంది. పాపని బుజ్జగిస్తున్నట్టుగా మంచి బీట్స్ మరియు ఆకట్టుకునే సాహిత్యంలో ఇంప్రెసివ్ గా ఉంది. అజనీష్ మాత్రం ట్రైలర్ కే కాకుండా సాంగ్ కి కూడా తన మార్క్ సంగీతం అందించాడు. మొత్తానికి మాత్రం తమ్ముడు నుంచి ఒక క్లీన్ అండ్ బ్యూటిఫుల్ ఫస్ట్ సింగిల్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహించగా ఈ జూలై 4న థియేటర్స్ లో రానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version