ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రాబిన్ హుడ్’

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రాబిన్ హుడ్’

Published on May 3, 2025 4:00 PM IST

యూత్ స్టార్ నిగతిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “రాబిన్ హుడ్”. అయితే నితిన్ వెంకీ నుంచి వచ్చిన భీష్మ హిట్ తో దీనిపై కూడా మంచి బజ్ నెలకొంది. కానీ అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ సాధించలేదు. దీనితో రాబిన్ హుడ్ నితిన్ కెరీర్లో వైఫల్యం గానే మిగిలిపోయింది.

ఇక ఈ సినిమా థియేటర్స్ రన్ తర్వాత ఇపుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ మే 10 నుంచి సినిమా స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. సో ఈ మే 10 నుంచి చిత్రం రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు