హీరో నితిన్ తన సినిమాల్లో అనేకసార్లు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, స్టైల్ ఫాలో అయ్యారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలో అయితే ‘తొలిప్రేమ’ నుండి ఏమయిందో ఏమో ఈ వేళ పాటను రీమిక్స్ కూడా చేశారు. ఇలా పలుసార్లు పవన్ స్టైల్‌ను ఇమిటేట్ చేసిన నితిన్ ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్టైల్‌ను ఫాలో అవుతున్నాడు.
ఆయన చేసిన కొత్త చిత్రం ‘భీష్మ’. ఈ సినిమాలో సింగిల్స్ యాంతమ్ పేరుతో ఒక పాట చేశారు. ఆ పాట తాలూకు పోస్టర్ ఒకటి తాజాగా రిలీజ్ చేశారు. అందులో నితిన్ నాలుగు రంగులు కలగలిసిన షర్ట్ ఒకటి వేసుకుని కనబడ్డారు. ఈ షర్ట్ అందరినీ బాగా ఆకట్టుకుంది. అయితే అదే కలర్ ఫార్మాట్లో ఉన్న చొక్కాను 1985లో వచ్చిన ‘విజేత’ చిత్రంలో చిరు వాడారు. ఇది కనిపెట్టిన నెటిజన్లు చిరు స్టైల్‌ను నితిన్ రీక్రియేట్ చేసి ఒకప్పటి మెగాస్టార్‌ను గుర్తుచేశాడని అభినందిస్తున్నారు. ఇకపోతే వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదలచేయనున్నారు.