‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ హీరో నితిన్ కి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. నితిన్ తాజాగా రెండు కొత్త సినిమాలకు సైన్ చేసాడు. ఇవి రెండు ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి.
ఈ రెండింటిలో మొదటిది.. కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించనున్నాడు. ఇది మార్చిలో ప్రారంభమవుతుంది. రెండవ సినిమా విషయానికొస్తే.. నితిన్ కి వరుస రెండు హిట్స్ ఇచ్చిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటించనున్నాడు. ఈ సినిమా ద్వారా సురేందర్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ప్రస్తుతం నితిన్ హార్ట్ ఎటాక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెకండాఫ్ కి డబ్బింగ్ చెబుతున్నాడు.