అక్క బాటనే పట్టిన కాజల్ చెల్లెలు

కాజల్ అగర్వాల్ చెల్లెలు అయిన నిషా అగర్వాల్ బాలివుడ్ ఆరంగేట్రానికి సకలం సిద్దమయ్యింది. అనిల్ మత్తూ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక చిత్రానికి సంతకం చేశారు. ఈ చిత్రంలో శ్రేయాస్ తలపడే,నానా పటేకర్, జాయెద్ ఖాన్ మరియు సమీర రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర పరదా బాగా చిత్రీకరణలో నిషా అక్టోబర్ 27 నుండి పాల్గొంటుంది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన “ఏమైంది ఈ వేళ” చిత్రంతో తెలుగుకి పరిచయం అయ్యింది. ఇక్కడ ఈ చిత్రం మంచి విజయం సాదించింది తరువాత నారా రోహిత్ సరసన “సోలో” చిత్రంలో నటించింది ఆ చిత్రం కూడా మంచి విజయం సాదించింది. ప్రస్తుతం తెలుగులో ఈ నటి మూడు చిత్రాలు చేస్తుంది “అలియాస్ జానకి”, ఆది సరసన “సుకుమారుడు” మరియు వరుణ్ సందేశ్ చిత్రంలో నటిస్తుంది. చూస్తుంటే ఈ భామ ఒకటి తరువాత ఒకటి చిత్రాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

Exit mobile version