టాలెంటెడ్ హీరో నిఖిల్ తన కెరీర్ లో మొదటి నుండి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అభిమానుల కోరిక మేరకు వారితో సరదాగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఓ అభిమాని ‘అభిమానుల గురించి ఒక్కమాట చెప్పండి? ‘ అని అడగగా.. ‘నా ఆక్సిజన్. విజయం, అపజయాల్లో నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ నిఖిల్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. అలాగే మరో అభిమాని ‘మీ మిత్రుడు ఎవరు?’ అని అడగగా ‘దర్శకుడు చందూ మొండేటి‘ అని చెప్పారు.
అలాగే మరో అభిమాని ‘హ్యాపీడేస్’ చూసి చాలా మంది బీటెక్ జీవితం ఇంత బాగుంటుందా అని బీటెక్ చేశారు. కానీ ఆపై సినిమా చూసి మోసపోయాం అనుకున్నారు. ఇలాంటివి విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?’ అని అడగగా.. ‘ఈ ప్రశ్న నా దర్శకుడు శేఖర్ కమ్ములను అడగండి’ అని నిఖిల్ నవ్వుతూ చెప్పాడు. మీకు ఇష్టమైన వెబ్ సిరీస్? అని అడగగా.. ‘నాకు గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ అంటే బాగా ఇష్టం అని తెలిపారు. మరి మీకిష్టమైన నటి ? అంటే.. ‘భూమిక. ‘ఖుషి’లో ఆమె చక్కగా ఉంటారు, బాగా నటించారు’ అని నిఖిల్ చెప్పుకొచ్చారు.