రాజా సాబ్ కోసం నిధి అగర్వాల్ తొలిసారి అలా..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పూర్తి హార్రర్ ఫాంటసీ చిత్రంగా ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అయింది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే, ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ ఓ కొత్త స్టెప్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ కోసం నిధి అగర్వాల్ తన పాత్రకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందట. దీంతో ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుుంటుందో తనకు క్లారిటీ ఉందని నిధి కాన్ఫిడెంట్‌గా చెబుతుంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version