‘హరిహర వీరమల్లు’లో బాగా కష్టమైన అంశమిదే అంటున్న పంచమి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి కలయికలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం అపుడే ప్రతీ ఒక్కరు ఏదొక ఇంటరాక్షన్ స్టార్ట్ చేశారు.

అలా హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లో జరిపిన సెషన్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. వీరమల్లులో పంచమిగా కనిపించనున్న ఈ బ్యూటీకి ఆ సినిమాలోనే బాగా కష్టమైన అంశం ఏంటి అనే దానికి సమాధానం ఇచ్చింది.

ఆ సినిమాలో గుర్రపు స్వారీ, ఇంకా డాన్సింగ్ బిట్ కూడా ఒకింత కష్టంగా అనిపించింది అని తనకిది ఒక లైఫ్ టైం పాత్ర, వర్కౌట్ అవుతుంది అని భావిస్తున్నాను అని అందరూ గర్వపడేలా వీరమల్లు ఉంటుంది అని సమాధానం ఇచ్చింది. దీనితో తన రేపీ వైరల్ గా మారింది. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version