ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘భైరవం’.. ఎందులో అంటే!

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అలాగే నారా రోహిత్ ల కలయికలో దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన రీసెంట్ చిత్రమే “భైరవం”. తమిళ సూపర్ హిట్ చిత్రం గరుడన్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఓ మోస్తరు గానే ఆడింది. అయితే థియేటర్స్ లో వచ్చి చాలా కాలమే అయ్యిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ రానున్న జూలై 18 నుంచి అందుబాటులో ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఇందులో తెలుగు సహా హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి తెస్తున్నట్టు ఇపుడు అనౌన్స్ అయ్యింది. సో ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకో పది రోజులు ఆగితే సరిపోతుంది.

Exit mobile version