తమిళ మాస్ మూవీలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’.. ఎంతసేపు ఉంటాడంటే?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు తెలుగునాట ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఆయన ఇప్పుడు తన సత్తా తమిళనాట కూడా చూపించేందుకు సిద్ధమయ్యాడు. మాస్ చిత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్ ప్రత్యక్షమైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ‘జైలర్’ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఇప్పుడు ‘జైలర్ 2’ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు తొలి భాగంలో కేమియో రోల్ చేసిన కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా నటిస్తున్నాడు. అయితే, ఆయనతో పాటు ఈసారి నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడట. దర్శకుడు నెల్సన్ ఇప్పటికే బాలయ్యతో చర్చలు కూడా జరిపాడట.

అయితే, బాలయ్య తన నిడివి కేవలం కేమియోగా మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉండేలా తీర్చిదిద్దాలని చెప్పాడు. దీంతో నెల్సన్ కొన్ని మార్పులు చేసి బాలయ్య పాత్రను సినిమాలో ఏకంగా 10 నిమిషాల పాటు ఉండేలా రూపొందిస్తున్నాడట. దీంతో ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య మాస్ సంభవం ఎలా ఉండబోతుందా.. తమిళనాట మాస్ సెంటర్లు ఎలాంటి రీసౌండ్ చేస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version