ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేమికులు, మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంత గానే ఎదురు చూస్తున్న సినిమా ‘ఎవడు’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ ఈ సినిమా గురించి ఓ ఆసక్తి కరమైన విషయాన్ని తెలియజేశారు. అదేమిటంటే ఎవడు సినిమా మొదట నందమూరి హీరోలు చెయ్యాలనుకున్నారు. ఆ విషయం గురించి కళ్యాణ్ రామ్ చెబుతూ ” నేను – తారక్ కలిసి గతంలో ఓ సినిమా చేద్దామనుకున్నాం. అందులో భాగంగా రెండేళ్ళ క్రితమే తారక్ నాకు ‘ఎవడు’ కథ చెప్పాడు. మన ఇద్దరం ఈ సినిమా చేస్తే బాగుంటుంది అన్నాడు. నాకు కథ కథ నచ్చి చేద్దాం అన్నాను. కానీ చివరికి అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదని” తెలిపాడు.
దీని ప్రకారం మొదటగా ఎవడు సినిమా నందమూరి హీరోస్ చెయ్యాల్సిన సినిమా కానీ అది కాస్త మిస్ అవ్వడంతో ఆ సినిమా మెగా హీరోల చేతికి వెళ్ళింది. ఎన్.టి.ఆర్ లానే రామ్ చరణ్ కూడా ఈ సినిమా సూపర్బ్ గా ఉంటుందని చెబుతున్నాడు. నందమూరి, మెగా హీరోలు మెచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..