శృతికి హరీష్ శంకర్ అప్పుడే మాటిచ్చాడట.!

శృతికి హరీష్ శంకర్ అప్పుడే మాటిచ్చాడట.!

Published on Jul 8, 2013 7:30 PM IST

Shruthi-hasan-and-Harish-Sh
కెరీర్ మొదట్లో చేసిన సినిమాలు కాస్త నిరుత్సాహపరిచిన 2012లో వచ్చిన ఒక్క ‘గబ్బర్ సింగ్’ సినిమాతో గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయింది శృతి హాసన్. ప్రస్తుతం ఇటు సౌత్ లో అటు నార్త్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శృతి తాజాగా రవితేజ నటించిన ‘బలుపు’ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా శృతి తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.

‘హరీష్ శంకర్ చాలా మంచి వ్యక్తి, తనంటే చాలా ఇష్టం. గబ్బర్ సింగ్ హిందీ రీమేక్ కదా పెద్ద పాత్ర కాదు అని అన్నారు కానీ హరీష్ శంకర్ తెలుగు వెర్షన్లో హిందీలో కంటే పెద్దగా ఉండేలా పాత్రని తీర్చిదిద్దాడు. అప్పుడు హరీష్ శంకర్ ‘ఈ సినిమాలో నీకు చేయడానికి పెద్దగా ఉండదు. కానీ నా తదుపరి సినిమాలో చాన్స్ ఇస్తాను’అన్నాడు. అన్నట్టుగానే ఎన్.టి.ఆర్ తో చేస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో చాన్స్ ఇచ్చాడని శృతి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం శృతి ‘రామ్ చరణ్ సరసన ‘ఎవడు’, అల్లు అర్జున్ సరసన ‘రేస్ గుర్రం’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తను బాలీవుడ్లో నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’, డి – డే’ సినిమాలు ఒకే రోజున అనగా జూలై 19న రిలీజ్ కానున్నాయి.

తాజా వార్తలు