15 నిమషాల సినిమాను ట్రిమ్ చేసిన సాహసం టీం…

gopichand_sahasam_movie_pos
సాధారణంగా ఒక సినిమాకు రివ్యూ రాసినప్పుడు మొదటిభాగం కంటే రెండో భాగం కాస్త నిమ్మదించిందని, కొన్ని సీన్ లను ట్రిమ్ చేస్తే బాగుంటుందని చదువుతుంటాం. అలాంటి రివ్యూలను ఎదుర్కునే అవకాశం రాకుండా ‘సాహసం’ సినిమా బృందం అనవసరమైన కొన్ని సీన్లను కత్తిరించారట. దీనితో సినిమా నిడివి పావుగంట తగ్గి 2.30 గంటల సినిమా 2.15 గంటలకు మారింది. సెన్సార్ పూర్తి చేసుకుని, ఎడిటింగ్ టేబుల్ నుండి బయటపడిన తరువాత రేపు విడుదలవుతున్న సినిమాను ఇలా కుదించినా వచ్చిన అవుట్ పుట్ ను చూసి చిత్ర బృందం చాలా ఆనందంగా వున్నారట. మరింకెందుకు ఆలస్యం గోపీచంద్ హీరోగా, తాప్సీ అతనికి జంటగా చంద్ర శేఖర్ యేలేటి వెండితెరపై ఎలాంటి సాహసాన్నిచుపించానన్నాడో చూడడానికి మీరు సిద్ధమేనా ??

Exit mobile version