దర్శకేంద్రుడు, సినీ మౌన ముని, పాటలు తియ్యడంలో దిట్ట, పూలు పళ్ళతో కళ్ళను కట్టిపడేయగల సమర్ధుడు.. ఇన్ని ఉపమానాలకు ఉదాహరణ మన రాఘవేంద్రరావు. ఈయన తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమాకు కధ-స్క్రీన్ ప్లే- దర్శకత్వమే కాక ఆ సినిమాలో ఒక్క పాట మినహా అన్ని పాటలకు ఆయనే నృత్య భంగిమలు సమకుర్చాడట. ఇలాంటివి ఈయను కొత్తేం కాదు. ఇదివరకే ‘పెళ్లి సందడి’లో ఆయన స్టెప్పులు సందడి చేసాయి. దానికిగాను ఆయన ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నందిని కుడా అందుకున్నారు. ఇప్పుడు రేవంత్ హీరోగా పరిచయం కాబోతున్న ఈ సినిమాలో ఒక పాప్ సాంగ్ మినహా అన్ని ఆయనే దగ్గరుండి చూసుకోవడం విశేషం. ఈ సినిమాకు కీరవాణి బాణీలను అందించగా యెలమంచలి సాయిబాబా నిర్మిస్తున్నారు.