ఫ్లాప్స్ వల్ల జీవితం అర్థమయ్యిందన్న నాగ చైతన్య

Naga-Chaithanya
అక్కినేని వారసుడిగా అరంగేట్రం చేసిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన తాజా చిత్రం ‘తడాఖా’ తో సక్సెస్ అందుకొని ఖుషీ ఖుషీగా ఉన్నాడు. అలాగే ఈ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ ని పక్కకి తోసేసి మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఒంటరిగా వేరే ఇంట్లో ఉంటున్నారు. అమల గారు మాత్రం చైతూ, అఖిల్ నాకు ఇద్దరూ ఒకటే అని అంటారు అలాంటప్పుడు మీరెందుకు విడిగా ఉంటున్నారు అని అడిగితే ‘ అలాంటిది ఏమీ లేదు. నా కెరీర్ ప్రారభించి సొంతంగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఎందుకో స్వతంత్రంగా జీవించాలనిపించింది. మామూలుగానే నాకు స్వేచ్చగా ఉండటం అంటే చాలా ఇష్టం. అలాగే ఒంటరిగా ఉండటం అనేది ఓ పాఠం, అలా ఉంటేనే మనకు బాధ్యతలు తెలుస్తాయి. అందరితో ఉన్నప్పుడు నేను ఏమీ పట్టించుకునేవాన్ని కాదు, ఇప్పుడైతే ఇంట్లో ఏమేమి కావలి అని నెల నెలా లిస్టు రాసుకొని మరీ సరుకులు తెచ్చుకుంటానని’ సమాధానం ఇచ్చాడు.

అలాగే మాట్లాడుతూ ‘సంపాదించటం మొదలు పెట్టాక అది కొనాలి ఇది కొనాలి అనుకునేవాణ్ణి కానీ కెరీర్లో కొన్ని ఫ్లాపులు వచ్చాకే జీవితం అంటే ఏంటో అర్థమయ్యింది. అలాగే ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని జాగ్త్రగా చూసుకోకపోతే చేజారి పోతుందని తెలుసుకున్నానని’ అన్నాడు. నాగ చైతన్య నటించబోయే మరో రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అందులో అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటిస్తున్న ‘మనం’ ఒకటి. అలాగే శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఇవి కాకుండా ‘ఆటో నగర్ సూర్య’ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version