మంచు వారబ్బాయి మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పోటుగాడు’. ఈ సినిమా 2012 కన్నడలో వచ్చిన ‘గోవిందాయ నమః’ సినిమాకి రీమేక్. కన్నడలో ఈ సినిమా తీసిన డైరెక్టర్ పవన్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ ‘ నేను – శ్రీధర్ కలిసి సినిమా చేయాలనుకున్నాం, అప్పుడు శ్రీధర్ ఓ కన్నడ మూవీ సీడీ ఇచ్చి చూడమన్నారు. చూసాను బాగా నచ్చడంతో చేద్దామని చెప్పాను కానీ ఓ కండిషన్ పెట్టాను అదేమిటంటే కన్నడలో తీసిన డైరెక్టర్ ఈ సినిమా చేస్తానంటేనే నేను చేస్తానని చెప్పా. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే మాకంటే ముందు ఈ సినిమా నాతోనే చేయాలని ఆయన ఫిక్సయ్యాడట. దాంతో వెంటనే పవన్ తో మాట్లాడి, సినిమా స్టార్ట్ చేసి చాలా వేగంగా పూర్తి చేసామని’ అన్నాడు.
ఈ సినిమా కోసం ఓ పాటని కన్నడ నుంచి తీసుకోగా, మరో పాటని చక్రి అందించాడు. మిగిలిన పాటలను అచ్చు స్వరపరిచాడు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు, లక్ష్మీ మంచు, మారుతి, లగడపాటి శ్రీధర్, పవన్ తదితరులు హాజరయ్యారు. వారు ఈ సినిమా సక్సెస్ అవ్వాలని బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సినిమాలో మనోజ్ సరసన సిమ్రాన్ కౌర్ ముండి, సాక్షి చౌదరి, రేచల్ వీస్,అను ప్రియా గోయెంక హీరోయిన్స్ గా నటిస్తున్నారు.