ఇప్పటి నుండి పాటలు పాడను – లతా మంగేష్కర్

Latha-Mangeskar
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇక నుండి పాటలు పాడాను అని చెప్పేశారు. ‘నేను ఈ మద్య కొన్ని సినిమా పాటలు పాడను కానీ ఈ గానాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను. అందుకే ఇప్పటి నుండి పాటలు పాడాలనుకోవడంలేదు. ఈ మార్పులు ఇప్పుడున్న ప్రపంచానికి అవసరమే కాని వీటిలో నేను ఇమడలేకపోతున్నాను అందుకే ఇకనుండి పాటలు పాడాలనుకోవడం లేదు’ అని ముంబై లో జరిగిన దీనానాధ్ మంగేష్కర్ పురస్కారాల ప్రధానం సందర్భంలో తెలియజేశారు.13సంవత్సరాల వయస్సు లో ‘గజా బాహు’ అనే మరాఠీ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం 70 సంవత్సరాలు సాగింది. దాదాపు అన్ని భాషలలో పాటలు పాడి తన స్వరంతో అందరిని ఆకట్టుకున్న గాయని లతా మంగేష్కర్. తన ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం 2001లో భారత దేశ ప్రతిష్టత్మక అవార్డ్ ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించింది.

Exit mobile version