బాహుబలి పుకార్లకు అంతే లేదా??

Bahubali
ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ నెల 6న ఈ సినిమా షూటింగ్ కర్నూల్ లో ప్రారంభమైన విషయం తెలిసినదే. అయితే ఈ సినిమా ప్రారంభంకాక ముందు నుండీ లెక్కలేనన్ని పుకార్లు వినిపించాయి. ఇవి వినలేక విసిగిపోయిన రాజమౌళి ఆఖరికి తన ట్విట్టర్ ద్వారా చాలా వాటిలకు సమాధానం ఇచ్చాడు. అయినా ఈ పుకార్లు ఆగడంలేదు. తాజాగా ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ ది డ్యుయల్ రోల్ అని, తండ్రి కొడుకుల పాత్ర అని పుకార్లు వస్తున్నాయి. పాపం వీటిని మన దర్శకధీరుడు విన్నాక ఎలా స్పందిస్తాడో మరి…

Exit mobile version