సౌత్ ఇండియన్ బ్యూటీ అనుష్క, తమిళ హీరో ఆర్య జంటగా నటించిన సినిమా ‘వర్ణ’. తమిళ్ లో ‘ఇరందం ఉలగమ్’ గా తెరకెక్కిన ఈ సినిమాకి సెల్వరాఘవన్ దర్శకుడు. మొదటగా ఈ సినిమాని సెప్టెంబర్ 19న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సుమారు 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాండ్ విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ఉండనున్నాయి. ఈ సినిమాని హైదరబాద్, చెన్నై, గోవా, జార్జియా లాంటి లొకేషన్స్ లో షూట్ చేసారు.
ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ, జార్జియన్, రష్యన్, ఉజ్బెక్ మరియు టర్కీష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నామని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం పివిపి వారు తెలిపారు. అనుష్క, ఆర్య రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్న ఈ మూవీకి హారీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.