మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాకి సంబందించిన కొత్త టీజర్ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కొంతకాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్రమోషన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది.
రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి నిమించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ అతిధి పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ భారీ బడ్జెట్ మూవీని దిల్ రాజు నిర్మించాడు. ‘ఎవడు’ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ‘1-నేనొక్కడినే’ సినిమాతో పోటీ పడనుంది.