దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘నేక్ డ్’ ఫేమ్ శ్రీ రాపాక “ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ” మరో కొత్త వెబ్ మూవీలో నటిస్తున్నారు. ఎస్ కే ఎన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, థర్డ్ ఐ సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. ఎక్స్ ట్రా మారిటల్ అఫైర్స్ అండ్ క్రైమ్ నేపథ్యంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే విధంగా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ సినిమా ట్రైలర్ బుధవారం సాయంత్రం రిలీజైంది.
అయితే ఒక పోలీస్ ఆఫీసర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా “మీ కింద ఫ్లాట్‌లో మర్డర్ జరిగింది.. అరవింద్‌ను ఎందుకు చంపావ్ అంటూ ఓ మహిళను ప్రశ్నిస్తాడు. రాత్రి మీరు సన్నిహితంగా గడిపారా, అరవింద్‌కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఓ పోలీస్ ఆఫీసర్ తన విచారణలో నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది. అంతేకాదు నువ్వు రెండు సార్లు మర్డర్ అటెంప్ట్ చేశావ్, అందుకు ఆధారాలు ఉన్నాయి అని అన్నారు. కామం మిమ్మల్ని లొంగదీసుకున్నప్పుడు, మీరు హద్దులు దాటేస్తారు అనే అర్థాన్ని ఇస్తూ క్యాప్షన్స్ కనిపించడం ట్రైలర్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ సినిమాను వెబ్ మూవీని త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత అశోక్ షిండే, సహ నిర్మాతలు రాజ్ కుమార్ షిండే, దేవేంద్ర శివరే, అనిల్ భండారి తెలిపారు.
అయితే ఈ వెబ్ మూవీలో అమిత్ తివారీ, శ్రీ గగన్, ఛత్రపతి శేఖర్, ఆనంద్ భారతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేఘనా చౌదరి, అర్చనా సింగ్, అర్జున్ శేఖర్, సంజన తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి టి. రాజేష్ సంగీతం అందిస్తుండగా, ఎంఎన్ బాలా సినిమాటోగ్రఫీ, బీఎన్ఆర్ ఎడిటర్‌గా, నిరంజన్ డైలాగ్స్ అందిస్తున్నారు.