‘సూర్య’ రోల్ పై క్రేజీ రూమర్ ?

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి, సూర్య కోసం బలమైన కథ రాశాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరోవైపు సూర్య ప్లాప్ లో ఉండటంతో, ఈ సినిమా పై సూర్య ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సూర్య డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని.. సూర్య రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అన్నట్టు ఇప్పటికే, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్ నడిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version