‘పుష్ప’లో ఆ సీక్వెన్సే మెయిన్ హైలైట్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో సినిమా అంటే.. ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. మరీ ఆ అంచనాలను అందుకోవాలంటే.. సీన్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉండాలి. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో స్మగ్లింగ్ సీన్స్ అన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ గా ఉంటాయని.. హాలీవుడ్ స్టంట్స్ రేంజ్ లో ఈ ఫైట్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ వెంకట్ డిజైన్ చేస్తున్నారని.. సినిమా మొత్తంలో ఈ సీక్వెన్స్ నే హైలైట్ అవ్వనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో ఈ స్మగ్లింగ్ సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇక మిగతా సీన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ నిర్మిస్తారట. కాగా నవంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో స్టార్ట్ చేస్తారట. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Exit mobile version