పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ కల్లా పూర్తి చేయాలనుకున్నప్పటికీ, పవన్ బిజీ షెడ్యూల్స్ కారణంగా అనుకున్న డేట్స్ ప్రకారం షూటింగ్ జరగలేదట. దాంతో పూర్తి షూటింగ్ ను పూర్తి చేయటానికి మరో నెల పడుతుందట. అంటే, మే నెల కల్లా పూర్తి సినిమాని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది చిత్రబృందం. కానీ కరోనా దెబ్బకి ప్రస్తుతం సినిమాల షూటింగ్ ఆపేసిన సమతి తెలిసిందే.
కాగా ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.