‘స్వయంభు’లో నిఖిల్ ఎంట్రీ సీన్ అదే !

‘స్వయంభు’లో నిఖిల్ ఎంట్రీ సీన్ అదే !

Published on Dec 8, 2025 8:07 AM IST

 Swayambhu

హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘స్వయంభు’. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పిరియాడికల్ మైథలాజిక్ చిత్రంగా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నిఖిల్ ఇంట్రో సీన్ అదిరిపోతుందని.. ఓ రాజు పాత్ర పోషిస్తున్న నిఖిల్, ఓ వార్ సీక్వెన్స్ తో సినిమాలో ఎంట్రీ ఇస్తాడని.. ఈ సీక్వెన్స్ లోని విజువల్స్ స్ నిజంగా అద్భుతంగా ఉంటాయట. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 13, 2026న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పిక్సెల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో భువన్ మరియు శ్రీకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు, నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

తాజా వార్తలు