ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా త్వరలోనే మొదలుకానుంది. కరోనా సమస్య లేకుండా ఉంటే ఈ భారీ బడ్జెట్ సినిమా ఈపాటికే మొదలుకావాల్సింది. ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ ముగిశాక ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఇటీవలే నాగ్ అశ్విన్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక కీ రోల్ చేయనున్నారు. దీంతో ప్రాజెక్ట్ మీద అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు అమితాబ్ 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అమితాబ్ ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే సినిమాలో ఆయనది అతిథి పాత్ర కాదు. ఫుల్ లెంగ్త్ రోల్. పైగా ఆయన నటించడం వలన సినిమాకు హిందీ మార్కెట్ పరంగా మంచి బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. అందుకే నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ బిగ్ బీకి అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయి ఉండొచ్చు. అమితాబ్ బచ్చనే అంత పారితోషకం తీసుకుంటుంటే ఇక కథానాయకిగా చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇంకెంత పారితోషకం తీసుకుంటుందో అనే చర్చ మొదలైంది ప్రేక్షకులు.