కొత్త సన్నివేశాలతో ముస్తాబవుతున్న అత్తారింటికి దారేది

కొత్త సన్నివేశాలతో ముస్తాబవుతున్న అత్తారింటికి దారేది

Published on Oct 23, 2013 11:00 PM IST

AD_Posters
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ తెలుగు సినీచరిత్రలో భారీ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించిన ఈ సినిమా ఇప్పటికీ మంచి బిజినెస్ ను చేస్తుంది. ఈ సినిమాకు ప్రేక్షకాకర్షణ పొందడానికి ఇప్పుడు సినిమాలో మరికొన్ని స=కొత్త సన్నివేశాలను జోడించనున్నారు

ఈ సినిమాకు సంబంధించిన కొత్త సన్నివేశాలు త్వరలో జతచేయనున్నారు. ఈ ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడాల్సివుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రణీత ముఖ్యపాత్ర పోషించింది. ఈ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు

తాజా వార్తలు