డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే, ఈ పాటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది ఈ సినిమా. కానీ, కరోనా దెబ్బకు ఈ సినిమా మరో ఏడాదికి పోస్ట్ ఫోన్ అయిపోయింది. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసినా.. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబులు కమిట్ అయిన సినిమాలు ఇప్పటికే నాలుగైదు పెండింగ్ లో ఉన్నాయి.
కాగా ఇలాంటి పరిస్తతుల్లో కరోనా అనంతరం ఆగిపోయిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. దాంతో ఎఫ్ 3 సినిమాని మొదలుపెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. దాంతో ఎఫ్ 3 నిర్మాతలు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ నిర్మాత మారిన కరోనా ప్రభావం పూర్తిగా తగ్గాలి, అప్పుడే సినిమాని మొదలుపెడతారు. పైగా వెంకీ నారప్పతో, వరుణ్ తేజ్ బాక్సర్ తో మరో మూడు నాలుగు నెలలు టైం కేటాయించాల్సి వస్తోంది.