‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్ బాబుకు ప్రపోస్ చేసిన అమ్మాయి గుర్తుందా? ఆమె మరెవరోకాదు ధన్య బాలకృష్ణ. ప్రస్తుతం ఈ భామ ‘సెకండ్ హ్యాండ్’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తుంది.
తన మత్తెక్కించే కళ్ళతో, మైమరపించే చూపులతో ధన్య కుర్రకారు, సినీ ప్రియుల మతిపోగొడుతుంది. ‘సెకండ్ హ్యాండ్’ సినిమా బృందం చిత్రంలో ఆమె నటన పై చాలా నమ్మకంగా వున్నారు. మరి ఈ సినిమా ద్వారా ఈ భామ ఎంత పాపులర్ అవుతుందో చూద్దాం
‘సెకండ్ హ్యాండ్’ సినిమా ఈ శుక్రవారం మనముందుకు రానుంది. కిషోర్ తిరుమల దర్శకుడు. ప్రముఖ రచయిత బి.వి.ఎస్ రవి ఈ సినిమాకు సహ నిర్మాత