రామ్ చరణ్ నెక్స్ట్ చిత్రం ఆయనతోనే.. RC17తో ఇక సెన్సేషన్ ఖాయం!

రామ్ చరణ్ నెక్స్ట్ చిత్రం ఆయనతోనే.. RC17తో ఇక సెన్సేషన్ ఖాయం!

Published on Jul 8, 2025 7:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ సినిమాలో నటిస్తు్న్నాడు. ఈ సినిమాను రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు యునానిమస్ రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపడం ఖాయమని అందరూ ఆశిస్తున్నారు.

అయితే, రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. గతంలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్‌తో రామ్ చరణ్ RC17 చిత్రం ఉంటుందనే టాక్ వచ్చింది. అయితే, ఆ తర్వాత రామ్ చరణ్ ఇతర డైరెక్టర్స్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉందనే వార్త జోరుగా చక్కర్లు కొట్టింది. దీంతో సుకుమార్‌తో సినిమా చేస్తాడా లేదా అనే సందేహం అభిమానుల్లో క్రియేట్ అయింది.

కాగా, ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం RC17 ఖచ్చితంగా సుకుమార్‌తోనే ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఇక చరణ్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సుకుమార్‌తో సినిమా చేస్తే అది సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని వారు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు