కమెడియన్ కొత్త అవతారం

Harsha-Vardhan
‘అమృతం’… ఈ పేరును బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. చిన్న పిల్లల నుండి పండు ముసలివాళ్ళ దాకా కామెడీతో కడుపుబ్బ నవ్వుకున్న సీరియల్. ఆ సీరియల్ లో నటించిన హర్షవర్ధన్ దాని తరువాత కమెడియన్ గా వెండితెరపై తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు. ‘జోష్’, ‘లీడర్’ సినిమాలలో మంచి పాత్రలలో నటించినా తనకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. కానీ ఇప్పుడు తను మాటల రచయితగా కొత్త అవతారం ఎత్తి అందరినీ విస్మయపరిచాడు.

ఇటీవలే విడుదలై ఘనవిజయం సాదించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’సినిమాకు హర్షవర్ధన్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. దీంతో అతనిలోని టాలెంట్ కనిపెట్టిన మనవాళ్ళు అతనికి ‘మనం’ సినిమాకు మాటలు రాసే ఛాన్స్ ను ఇచ్చారు. అక్కినేని వంశంలో మూడు తారాల నటులూ నటిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు. రొట్టె విరిగి నేతిలో పడటం అంటే ఇదేనేమో మరి.

Exit mobile version