ఇలా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు – మిక్కీ

ఇలా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు – మిక్కీ

Published on Dec 30, 2012 1:33 PM IST

micky
సాఫ్ట్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియోకి వస్తున్న రెస్పాన్స్ చూసి మిక్కీ షాక్ అయ్యాడు. మిక్కీ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను ఇంత భారీగా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. నాకు వస్తున్న అభినందనలు, కామెంట్స్ విని ఎంతో థ్రిల్ అయ్యాను. ఇలాంటి ఒక భారీ బడ్జెట్ మరియు క్రీజీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దిల్ రాజు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని’ అన్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ కాగా ప్రేక్షకులు , సినిమా అభిమానులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమాలో వీరికి జోడీగా అంజలి – సమంత జోడీ కట్టారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.

తాజా వార్తలు