పి. సునీల్ కుమార్ రెడ్డి తాజా సినిమా ‘నేనేం చిన్న పిల్లనా?’ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. రామానాయుడు నిర్మిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ హీరో. తన్వి వ్యాస్ మరియు సంజన హీరోయిన్స్. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క ముఖ్య సన్నివేశాలను హీరో, హీరొయిన్ల నడుమ తీస్తున్నారు. సమాచారం ప్రకారం డి. రామానాయుడు ఒక పాత్రపోషిస్తున్నాడట. ఈ షెడ్యూల్ తో చాలాభాగం చిత్రీకరణ ముగిసింది. పల్లె నుండి పట్నం వచ్చిన ఒక యువతి చుట్టూ తిరిగే కధ. ఎం.ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా డెన్మార్క్, స్వీడన్ లలో ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంది. మరో రెండు నెలలో ఈ సినిమా విడుదలకావచ్చు