23న నేనేం చిన్నపిల్లనా..? ఆడియో

23న నేనేం చిన్నపిల్లనా..? ఆడియో

Published on Aug 21, 2013 3:20 PM IST

Nenem-Chinna-Pillana
డా. డి రామానాయుడు నిర్మాతగా ‘అందాల రాక్షసి’ రాహుల్ హీరోగా తన్వి వ్యాస్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘నేనేం చిన్న పిల్లనా..?’ ఎం.ఎం శ్రీ లేఖ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఉదయం 11:30 నిమిషాలకు జరగనుంది.

‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్. ఒక పల్లెటూరిలో జీవించే అమ్మాయి సిటీకి వెళ్ళాక ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలు యుఎస్ లో షూట్ చేసారు.

తాజా వార్తలు