నెగటివ్ షేడ్స్ ఉండడం వల్ల ఆ సినిమా చేశానంటున్న త్రిష

నెగటివ్ షేడ్స్ ఉండడం వల్ల ఆ సినిమా చేశానంటున్న త్రిష

Published on Jan 20, 2013 10:41 PM IST

Trisha
గత పది సంవత్సరాలుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ త్రిష తన గ్లామర్ తోనే కాకుండా, నటనతో కూడా ఆకట్టుకుంది. త్రిష విశాల్ కి జంటగా నటించిన ‘వేటాడు వెంటాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో త్రిష తన పాత్ర గురించి చెబుతూ ‘ ఈ సినిమాలో నా పాత్ర ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా నేను చేయడానికి గల ముఖ్య కారణం నేను చేసిన పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఇక నుంచి ఇలా చాలెంజింగ్ గా ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నానని’ అంది. ఎం.ఎస్ రాజు డైరెక్షన్లో త్వరలో ప్రారంభం కానున్న ‘రమ్’ సినిమా లో త్రిష నటించనుంది. త్రిష ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చేయనుంది.

తాజా వార్తలు