నెగటివ్ పాత్రలో కనిపించనున్న సీనియర్ నరేష్

నెగటివ్ పాత్రలో కనిపించనున్న సీనియర్ నరేష్

Published on Nov 27, 2013 2:05 PM IST

yamudiki-mogudu-audio-launc
‘చిత్రం భళారే విచిత్రం’, ‘జంబ లకిడి పంబ’ లాంటి ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఒకప్పటి కామెడీ హీరో సీనియర్ నరేష్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన రెండవ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో చేతిండా సినిమాలతో బాగా బిజీగా ఉన్న నరేష్ ని ఇప్పటి వరకు పోజిటివ్ పాత్రలే చేసారు నెగటివ్ పాత్రలు చేసే ఉద్దేశం లేదా? అని అడిగితే నరేష్ సమాధానమిస్తూ ‘ కళాకారులన్నాక నవరసాలు పలికించగలగాలి. కొద్ది కాలం నుంచి ఓ మంచి నెగటివ్ రోల్ కోసం వేచి చూస్తున్నాను. ఆ కల ఇప్పుడే నెరవేరింది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో నెగటివ్ పాత్రలో కనిపించనున్నానని’ నరేష్ సమాధానం ఇచ్చాడు.

అలాగే మీ అమ్మగారు విజయనిర్మల మంచి డైరెక్టర్. మరి మీరెప్పుడు మెగాఫోన్ పట్టుకుంటారు అనడిగితే ‘ జంధ్యాల, విజయ నిర్మల గారి స్కూల్ నుంచి వచ్చిన వాన్ని నేను. నేను రచయితని కూడా, కథలు, కవితలు రాశాను. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మెగాఫోన్ పట్టుకోవాలనుకుంటున్నాను. అలాగే నా కవితలతో ఒక పుస్తకం రిలీజ్ చెయ్యాలనుకుంటున్నానని’ నరేష్ అన్నాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నరేష్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడేమో చూడాలి..

తాజా వార్తలు