మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాల దర్శకుడు అనుదీప్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి ఫన్ రోలర్ కోస్టర్‌గా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు తెప్పించేలా ఉండబోతుందని.. ప్రేక్షకులు ఈ టీజర్‌తో కడుపుబ్బా నవ్వుకుంటారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.