కార్తికేయ దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా తారాగణంలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. ముందుగా ఆదా శర్మ, మోనాల్ గజ్జర్ లను హీరొయిన్లుగా అనుకుని వారితో కొన్ని సన్నివేశాలను కుడా తీసారు. కాకపోతే ఇప్పుడు డేట్లు సర్దుబాటు కాక వీరిద్దరినీ సినిమానుండి తప్పించారు. సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాలో ప్రధాన హీరొయిన్ పాత్రలో నీలం ఉపాధ్యాయను తీసుకున్నారు. నీలం ఉపాధ్యాయ ఇప్పటికే ‘యాక్షన్ 3డి’లో అల్లరి నరేష్ సరసన నటిస్తుండగా ఆ సినిమా విడుదల కాకముందే నారా రోహిత్ సరసన నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో లక్ష్మి కృతిక మరో హీరొయిన్ గా కనబడనుంది. ఈ సినిమాను శ్రీ శైలేంద్ర మూవీస్ బ్యానర్ పై డి.ఎస్ రావు నిర్మిస్తున్నారు.