మరోసారి మెగాఫోన్ పట్టనున్న నీలకంఠ

మరోసారి మెగాఫోన్ పట్టనున్న నీలకంఠ

Published on Jun 27, 2013 1:15 AM IST

Neelakanta
ప్రముఖ దర్శకుడు నీలకంఠ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించాడు. కధనాల ప్రకారం ఈ సినిమా పేరు ‘మాయ’గా అనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో ప్రధాన తారాగణం ఇంకా ఖరారు చెయ్యవలసివుంది. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా మొదలుకానుంది. గతంలో ఇతను వరుణ్ సందేశ్, కేథరీన్ త్రెస మరియు సంచిత పదుకునె నటించిన ‘చమ్మక్ చల్లో’ సినిమా పరాజయం పాలవ్వడంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ‘విరోధి’, ‘మిస్టర్ మేధావి’ సినిమాలలా కాకుండా అతను తీసిన కమర్షియల్ సినిమా ఫ్లాప్ కావడంతో అతను మరోసారి తన పాత పంధానే అనుసరించచ్చు.

తాజా వార్తలు