నయనతార పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందా?

Nayanathara
అందాల భామ నయనతార తన రాబోతున్న సినిమాలో పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. తమిళనాడులో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం నయనతార జయం రవి సరసన ఓ సినిమాలో నటించనుంది. జయం రాజ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

ప్రస్తుతం ఈ పాత్ర కోసం నయనతార ట్రైనింగ్ తీసుకుంటోందని సమాచారం. మిగిలిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. పెళ్లి వద్దను కొని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన నయనతార బాక్స్ ఆఫీసు దగ్గర వరుస విజయాలనే అందుకుంటోంది. తాజాగా తమిళంలో రాజా రాణి, ఆరంభం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

నయనతార ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అనామిక మరియు గోపీచంద్ హీరోగా బి. గోపాల్ డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే మారుతి డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా నటించనున్న ‘రాధ’ సినిమాకి కూడా నయనతార సైన్ చేసింది.

Exit mobile version