నయనతార ఎట్టకేలకు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘అనామిక’ షూటింగ్ లో కలవనుంది. గతకొన్ని నెలలుగా ఆమె డైరీ తమిళ, తెలుగు సినిమాల కాల్షీట్లతో నిండిపోయింది. తాజా సమాచారం ప్రకారం రేపు నయన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గుని చివరి షెడ్యూల్ ను ఈ నెలాఖరుకు ముగించనుంది
ఇటీవలే నయనతార నటిస్తున్న తమిళ చిత్రం ‘ఇదు కాతిర్ వేలన్ కాదల్’ సినిమాలో పాట చిత్రీకరణ కోసం పొల్లాచి వెళ్ళింది. ఈ రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ లో ఆమె ఉధయనిది స్టాలిన్ సరసన నటిస్తుంది. ఇప్పుడు శేఖర్ బృందంతో నయన్ జతకట్టి లాంఛనాన్ని పుర్తిచేయనుంది
ఈ సినిమాలో నయనతార ప్రధానపాత్ర పోషించగా వైభవ్ రెడ్డి, హర్షవర్ధన్ రానే ముఖ్య పాత్రలు పోషించారు. విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ సినిమాను శేఖర్ కమ్ముల రిమేక్ చేస్తున్నాడు. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సినిమాను ఎండెమోల్ ఇండియా, లొంగ్లిన్ ప్రొడక్షన్స్ మరియు సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.