మెగా157 షూటింగ్‌లో జాయిన్ అయిన నయనతార

మెగా157 షూటింగ్‌లో జాయిన్ అయిన నయనతార

Published on Jun 17, 2025 12:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన టీమ్, ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది. పూర్తి ఎంటర్‌టైనర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు.

ఇక ఈ చిత్ర షూటింగ్‌ను ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో జరుపుకుంటున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్‌లో హీరోయిన్ నయనతార కూడా తాజాగా జాయిన్ అయింది. ముస్సోరిలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగే, చిరు-నయన్ పై ఓ సాంగ్ కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో అనిల్ రావిపూడి తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు