నటి నయనతార నటించిన సస్పెన్స్ థిల్లర్ సినిమా ‘అనామిక’ కి సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. సెన్సార్ వారు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ జారీచేయడం జరిగింది. ఈ సినిమాలో సెన్సార్ వారు ఎటువంటి కట్స్ చేయలేదని సమాచారం. అలాగే త్వరలో ఈ సినిమా విడుదలకు సంబందించిన అధికారిక ప్రకటన వేలుబడే అవకాశం వుంది. బాలీవుడ్ లో హిట్ సాదించిన ‘కహాని’ సినిమా రీమేక్ గా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఎండేమోల్ ఇండియా బ్యానర్ పై రెండు బాషలలో నిర్మించిన ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విజయం సాదిస్తుందని శేఖర్ కమ్ముల చాలా నమ్మకంగా వున్నాడు. తెలుగు సినీ అభిమానులకు ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ అనుభూతిని కలిసిగిస్తుందని ఆయన తెలియజేశాడు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో నయనతార విద్య బాలన్ పాత్రని చేసింది. దానితో ఆమె ఎలాచేసింది అని అందరిలో ఆసక్తి నెలకొంది.